Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను.. అందాల రాక్షసి

తన గురించి, తన సినీ కెరీర్ గురించి మీ (నెటిజన్స్) ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదనీ అందాల రాక్షసిగా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి హెచ్చరించింది. పైగా, తన గురించి సోషల్ మ

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (09:16 IST)
తన గురించి, తన సినీ కెరీర్ గురించి మీ (నెటిజన్స్) ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదనీ అందాల రాక్షసిగా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి హెచ్చరించింది. పైగా, తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం గాసిప్స్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
 
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠి వదిలేసిన రెండు సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యాయంటూ ట్వీట్ చేసింది. 'తొలిప్రేమ', 'గీత గోవిందం' సినిమాలను లావణ్య వదులుకున్నారు, కానీ అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటూ చేసిన ట్వీట్‌పై లావణ్య స్పందించింది.
 
తన గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని అందాల రాక్షసి హెచ్చరించింది. 'నా గురించి వస్తున్న గాసిప్స్ పై మౌనంగా ఉంటున్నానంటే దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు' అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
 
సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న న్యూస్ పూర్తిగా ఫేక్ న్యూస్ అని, అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని ఫైర్ అయింది. ఈ విషయాన్ని లావణ్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 
 
ఇకపోతే లావణ్య త్రిపాఠి చివరగా 'ఇంటిలిజెంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇపుడు వరుణ్ తేజ్‌తో "అంతరిక్షం", నిఖిల్‌తో "ముద్ర" అనే రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments