Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగర్‌లో సీన్లు నేటివిటీకి తగ్గట్లు లేవు.. ట్రోల్స్ మొదలు..

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (17:42 IST)
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లైగర్'. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం రియాలిటీకి దగ్గరగా లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈ సినిమాలో ఏమాత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా లేదని అంటున్నారు.
 
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో డబ్బింగ్ ఇచ్చినట్టు ఉందని విమర్శిస్తున్నారు. అయితే హిందీలో మాత్రం ఈ మూవీ స్లోగా పికప్ అయ్యేలా కనిపిస్తుంది. అలా అని అక్కడ కూడా రివ్యూలు గొప్పగా రాలేదు.
 
ఏది ఎలా ఈ చిత్రంలో రెండు సన్నివేశాలు మాత్రం ఫ్యాన్స్‌ను బాగా హర్ట్ చేశాయట. రియాలిటీకి ఏమాత్రం అవి దగ్గరగా లేవని ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. 
 
ఇంతకీ ఆ సీన్లు ఏంటి అంటే.. తల్లి పాత్ర పోషించిన రమ్యకృష్ణకి.. హీరో విజయ్ దేవరకొండకి మధ్య ఓ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఈ సీన్ అయిన వెంటనే హీరోకి, హీరోయిన్‌కు మధ్య ఫాస్ట్ బీట్ సాంగ్ వస్తుంది. అలాగే బాక్సింగ్ కాంపిటీషన్ కోసం హీరో లాస్ వేగాస్‌కి వెళ్తాడు.
 
అక్కడ పోటీదారుడు హీరోకి ఓ పంచ్ ఇస్తే.. హీరో కింద పడిపోతాడు. హీరో తల్లి దీనిని ముంబైలో ఉండి టీవీలో చూస్తూ ఉంటుంది. ఆమె టీవీ ముందు అరుస్తూ లే అని పలకగానే లాస్ వేగాస్‌లో ఉన్న హీరో లేచి ఫైట్ చేస్తాడు. ఇలాంటి సన్నివేశాలు ఓ 30 ఏళ్ళ క్రితం చూసినట్టు ఉన్నాయని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments