Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' విడుదల అప్పుడే.. సావిత్రి చివరి రోజులు మాత్రం..?

''మహానటి'' విడుదల తేదీని సినిమా యూనిట్ వెల్లడించింది. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్ నిర్మాణంలో రూపొందుతుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (13:45 IST)
''మహానటి'' విడుదల తేదీని సినిమా యూనిట్ వెల్లడించింది. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్ నిర్మాణంలో రూపొందుతుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుందని ట్విట్టర్ ద్వారా సినిమా యూనిట్ ప్రకటించింది. 
 
తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే గ్రాఫిక్స్ ప‌నుల‌తో పాటు చిత్రానికి సంబంధించిన కొన్ని ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో సినిమాను మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు సినీ యూనిట్ ప్రకటించింది. విడుదల తేదీతో పాటు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ లుక్ సూపర్బ్ అనేలా వుంది. 
 
ఇకపోతే, మహానటిలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషిస్తుండ‌గా, జమునగా సమంత, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, త‌రుణ్ భాస్క‌ర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఏఎన్ఆర్‌గా చైతూ న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా సావిత్రి కుటుంబ స‌భ్యుల అభ్యర్థన మేరకు సావిత్రి జీవితంలో చివరి రోజులు చూపించరని తెలుస్తోంది. కాక‌పోతే చివ‌రి రోజుల‌లో సావిత్రి చాలా బాధ‌ల‌కి గురైంద‌ని మాత్రం కార్డ్ ద్వారా చెప్తార‌ని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments