Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు మహేష్ బాబు కుమార్తె సితార అదిరిపోయే గిఫ్ట్

అక్కినేని ఇంట ఇంకా పెళ్ళి సందడి కనిపిస్తూనే ఉంది. నాగచైతన్య, సమంతల వివాహం జరిగి 40 రోజులవుతున్నా ఇప్పటికీ వారి ఇంట పండుగ వాతావరణమే కనిపిస్తోంది. చైతు, సమంతల వివాహానికి, వెడ్డింగ్ రిసెప్షన్‌కి కొంతమంది ప్రముఖులు హాజరుకాలేకపోయారు. అందులో మహేష్ బాబు ఒకర

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (17:29 IST)
అక్కినేని ఇంట ఇంకా పెళ్ళి సందడి కనిపిస్తూనే ఉంది. నాగచైతన్య, సమంతల వివాహం జరిగి 40 రోజులవుతున్నా ఇప్పటికీ వారి ఇంట పండుగ వాతావరణమే కనిపిస్తోంది. చైతు, సమంతల వివాహానికి, వెడ్డింగ్ రిసెప్షన్‌కి కొంతమంది ప్రముఖులు హాజరుకాలేకపోయారు. అందులో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు కూతురు సితారకు సమంత అంటే ఎంతో ఇష్టం. 
 
బ్రహ్మోత్సవం సినిమా నుంచి సితారకు సమంత అంటే ఎంతో ఇష్టం. సమంతకు సితార అంటే ఇష్టం. అయితే వివాహానికి వెళ్లకపోవడంతో తన స్నేహితురాలికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని మహేష్‌ను సితార కోరిందట. దీంతో షాపింగ్ వెళ్ళి నీకు ఇష్టమొచ్చిన గిఫ్ట్ కొని సమంతకు ఇవ్వు అని మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
 
ఒక బంగారు దుకాణానికి వెళ్ళిన సితార తనకు నచ్చిన ఒక బంగారు హారాన్ని సెలక్ట్ చేసింది. ఆ బంగారు హారం విలువ కోటి 20 లక్షల రూపాయలు. తన కుమార్తెకు నచ్చినది కావడంతో మహేష్ బాబు ఆన్‌లైన్‌లోనే ఆ గిఫ్ట్‌ను కొనిచ్చారు. ఆ గిఫ్ట్‌ను నేరుగా సమంతకు సితార తీసుకెళ్ళి ఇచ్చింది. దీంతో మురిసిపోయిన సమంత తనకు ఈ గిఫ్ట్ బాగా నచ్చిందని సితారను ముద్దాడుతూ థ్యాంక్స్ చెప్పిందట. ఆ బంగారు హారాన్ని ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ కూడా చేసింది సమంత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments