Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. బీస్ట్ మోడ్‌లో మహేష్ బాబు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (19:48 IST)
Mahesh babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న  యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. 
 
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ మెటీరియల్స్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్‌కు సంబంధించిన క్లిక్ ఒకటి వైరల్ అవుతోంది. మహేష్ బాబు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటో అది. ఈ చిత్రంలో మహేష్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నాడు.
 
దివంగత తెలుగు నటుడు కృష్ణ కుమారుడు మహేష్ బాబు 1989లో తన తండ్రి నటించిన పోరాటం చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. మహేష్ తన తండ్రి నటించిన బజార్ రౌడీ, శంఖారావం చిత్రాలలో కూడా నటించాడు. 
 
మహేష్ బాబు వెండితెరపై 1999 చిత్రం రాజ కుమారుడు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో నటి ప్రీతి జింటా మహేష్ సరసన నటించారు. ఆపై అతిధి, దూకుడు, స్పైడర్, అతడు, పోకిరి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, మహర్షి వంటి చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు. 
 
ప్రస్తుతం అతను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన గుంటూరు కారం కోసం పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో కలిసి పని చేయనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments