Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ చేతుల మీదుగా 23న 'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (14:47 IST)
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమాతో, గౌరీ రోణంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 
 
గతంలో శ్రీకాంత్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంతేకాదు ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు.
 
గతంలో ఆయనతో ‘పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్‌డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. 
 
ఇపుడు ట్రైలర్‌‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీకాంత్ మాదిరిగానే ఆయన తనయుడికి ఈ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments