Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు వెయిటింగ్, మరి పూరీ రియాక్షన్ ఏంటి?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (20:56 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం పోకిరి. ఈ చిత్రంలో మహేష్ బాబును పూరి తనదైన స్టైల్లో చూపించి మెప్పించారు. దీంతో పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. దీంతో మహేష్ - పూరి కాంబినేషన్ అంటే అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత మహేష్‌ - పూరి కలిసి చేసిన రెండో సినిమా బిజినెస్ మేన్.
 
ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్ నటించింది. ఇందులో కూడా మహేష్ బాబుని సరికొత్తగా చూపించాడు పూరి. ఈ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో మహేష్‌ - పూరి కలయికలో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎప్పటి నుంచో వెయిటింగ్. పూరి మహేష్ కోసం జనగణమన అనే కథ రెడీ చేయడం.. ఆ కథ మహేష్ బాబుకి చెప్పడం జరిగింది.
 
కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా..? ఉండదా..? అని గత కొంత కాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే... పూరితో సినిమా గురించి మహేష్‌ తాజాగా స్పందించాడు. ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహేష్ జరిపిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూరి సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
 
ఇంతకీ ఏమన్నాడంటే... సర్ భవిష్యత్తులో మీరు పూరితో సినిమా చేస్తారా? మేము వెయిటింగ్ సర్ ?’ అని అడగగా.. దీనికి మహేష్.. తప్పకుండా చేస్తాను. నా ఫేవరేట్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన స్టోరీ నెరేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను’ అని మహేష్ చెప్పారు. ఈవిధంగా మహేష్‌... పూరితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టు చెప్పారు. మరి.. పూరి మహేష్ బాబుకి స్టోరీ చెబుతారా..? త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments