Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా తంగలాన్ నుండి మేకింగ్ వీడియో

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (14:53 IST)
Vikram Birthday, Thangalan
వైవిధ్యమైన యాక్టర్ చియాన్ విక్రమ్ కొత్త సినిమా ‘తంగలాన్’. పా. రంజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా ఓ మేకింగ్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరికీ నచ్చేలా మేకింగ్ తో పాటు ఓ అద్బుతమైన వీడియో రిలీజ్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ కోసం విక్రమ్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ చూస్తోంటే మూవీ కోసం మొత్తం ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంది. ఈ తరహా చిత్రాల్లో విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు. అది మరోసారి తంగలాన్ తో కనిపించబోతోందనిపిస్తోంది.
 
ప్యాన్ ఇండియన్ సినిమాగా బహుభాషల్లో విడుదల కాబోతోన్న తంగలాన్ లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు  డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్, ముత్తుకుమార్ తో పాటు అనేకమంది ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments