Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్ము దులుపుతున్న "మిడిల్ క్లాస్ అబ్బాయి"

2017 సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది ఆఖర్లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం "మిడిల్ క్లాస్ అబ్బాయి" (ఎంసీఏ).

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (10:22 IST)
2017 సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది ఆఖర్లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం "మిడిల్ క్లాస్ అబ్బాయి" (ఎంసీఏ). నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి కాంబినేషన్‌లో ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద తనదైన మార్కు వసూళ్లతో ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో రూ.20 కోట్లను వసూలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. 
 
అయితే, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన దిల్ రాజు ఆలోచనలో పడ్డారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని - భూమిక మధ్య సీన్స్ హైలైట్ అవుతాయని భావించారట. అందువలన ఆ సీన్స్‌కి ప్రాధాన్యతనిచ్చి, నాని - సాయిపల్లవి మధ్య గల నాలుగు రొమాంటిక్ సీన్స్‌ను లేపేశారట.
 
ఆ ఎఫెక్ట్ కథపై బాగానే పడిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత, హీరో.. హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ కాస్త ఘాటుగా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకుంటూ ఉండటంతో, దిల్ రాజు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అనవసరంగా ఆ సీన్స్‌ను లేపేశామని ఆయన చాలా ఫీలవుతున్నారట. కట్ చేసిన ఆ సీన్స్‌ను ఆయన యాడ్ చేస్తారా .. లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments