Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను ఉద్దేశించి ''ఎస్'' సెంటిమెంట్‌ను పెట్టలేదు: చందూ మొండేటి

ప్రేమమ్ సినిమా తెలుగులో రిలీజైన సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ ‘ప్రేమమ్‌’ను యధాతథంగా దించేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు అవసరమైన మార్పులు చేశాడు దర్శకుడు చందూ మొండేటి. ఈ నేపథ్యంలో సినిమాలో హీరోకు ఉన్న

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (10:59 IST)
ప్రేమమ్ సినిమా తెలుగులో రిలీజైన సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ ‘ప్రేమమ్‌’ను యధాతథంగా దించేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు అవసరమైన మార్పులు చేశాడు దర్శకుడు చందూ మొండేటి. ఈ నేపథ్యంలో సినిమాలో హీరోకు ఉన్న ‘ఎస్‌’ సెంటిమెంట్‌ సమంత గురించే అంటూ కథనాలు మొదలయ్యాయి. దీనిపై దర్శకుడు చందూ స్పందించాడు. 
 
తొలి అమ్మాయి పేరు సుమ అంటే పువ్వు అనే అర్థం ఉందని... ఆ ప్రేమ తొందర్లోనే పువ్వులా వాడిపోతుందని చెప్పాం. రెండో అమ్మాయి పేరు సితార. అంటే నక్షత్రం. చూడడానికి ఎంత బాగున్నా మనకు అందనిది అని అర్థం. ఇక, మూడో అమ్మాయి పేరు సింధు. సింధూరంలా మన నుదిటినే అంటి పెట్టుకుంటుందని అర్థం. అలాగే హీరో పేరు విక్రమ్‌. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే ఆయా పాత్రలకు ఆ పేర్లు పెట్టాన’ని దర్శకుడు తెలిపాడు. సమంతను ఉద్దేశించి ‘ఎస్‌’ సెంటిమెంట్‌ను పెట్టలేదని చెప్పాడు. 
 
స్టార్ ఫ్యామిలీ ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న ఆ అందాల భామ... కొంతకాలంగా కొత్త సినిమాకు సైన్ చేయడం లేదనే టాక్ ఉంది. అయితే అమ్మడు ఓ కోలీవుడ్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందనే న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిందట. తాజాగా కోలీవుడ్‌లో మాత్రం నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందనే టాక్ వినిపిస్తోంది. శివకార్తీకేయన్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన ఈ అందాల భామ... రీసెంట్‌గా విశాల్ నయా మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోందనే రూమర్స్ జోరందుకున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

ఇండోర్‌లో విజృంభించిన కరోనా.. కడుపు నొప్పితో వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. వీడియో వైరల్ (video)

వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments