Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్' టిక్కెట్ కోసం వీరాభిమాని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (18:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం.. "భీమ్లా నాయక్" సినిమా టిక్కెట్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల పురానీ పేటకు చెందిన 11 యేళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని. అయితే, ఈ నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్" విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఫస్ట్ షో చూడాలని భావించాడు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్కింగ్స్ ఓపెన్ చేశారని చెప్పడంతో సినిమా టిక్కెట్ కొనుగోలు చేసేందుకు రూ.300 కావాలని తండ్రిని కోరాడు. 
 
అయితే, అతను దినకూలీ కావడంతో అంత డబ్బు తన వద్దలేదని చెప్పి కుమారుడి కోరికను తోసిపుచ్చాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చూసిన తల్లిదండ్రులకు ఇంట్లోని దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments