Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ మిథు అంటూ తాప్సీని అభినందించిన మిథాలీ రాజ్

Webdunia
బుధవారం, 13 జులై 2022 (20:23 IST)
Taapseepannu, Mithali Raj
దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “శభాష్ మిథు”. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేసింది. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్‌గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ.
 
ప్రస్తుతం శభాష్ మిథు రిలీజ్ కు రెడీ గా ఉంది, జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధిన ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాప్సీ తో పాటు క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ ప్రొమోషన్స్ లో పాల్గొనడం గమనార్హం. ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వేదికగా పత్రికా విలేకర్లు తో పాటు అభిమానులతో ముచ్చటించారు. తాప్సీ ప‌న్ను నా పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింద‌ని ప్ర‌శంసించారు. అందుకు త‌ను క్రికెట‌ర్‌గా చాలా ప్రాక్టీస్ చేసింద‌ని తెలిపారు.
 
ఇదివరకే భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు.  "శభాష్ మిథు" ట్రైలర్ అనూహ్య స్పందన లభించింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూలై 15న విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

Lakh Bribe: లంచం తీసుకున్న ఎస్ఐకి ఏడేళ్ల జైలు శిక్ష.. ఎక్కడ?

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments