Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారు.. : నటుడు రవిబాబు

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (13:10 IST)
సీనియర్ నటుడు చలపతి రావు ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఆయన కుమారుడు, నటుడు రవిబాబు స్పందించారు. మా డాడీ చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారని చెప్పారు. భోజనం చేసి చికెన్ కూర, చికెన్ బిర్యానీ ఆరగించారన్నారు. ఆ ప్లేట్‌ను చేతికిచ్చి వెనక్కి వాలిపోయారని, అంత సింపుల్‌గా, హ్యాపీగా వెళ్లిపోయారని గద్గగ స్వరంతో చెప్పారు. వాస్తవానికి ఈ రోజే అంత్యక్రియలను నిర్వహించాలని అనుకున్నాం.. కానీ, నా చెల్లెళ్లు అమెరికాలో ఉన్నారని, వాళ్లు రావడానికి సమయం పడుతుందన్నారు. వారు వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు. 
 
"మా నాన్న గురించి నాకంటే మీ అందరికే ఎక్కువ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఎలా ఉంటారనే విషయం చిన్నపుడు నాకు తెలియదు. కానీ, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తెలిసింది. అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. ఎంతో మందికి సాయం చేశారని తెలిసింది. ఈ విషయాలు మాకు తెలిసేవి కావు. మా నాన్నకు రామారావు గారు, ఆహారం, హాస్యం ఈ మూడంటే చాలా ఇష్టమన్నారు. 
 
ఎపుడూ అందర్నీ నవ్విస్తూ ఉండేవారన్నారు. అలాగే, ఇపుడు ఒక్క క్షణం కూడా బాధలేకుండా క్షణాల్లో వెళ్లిపోయారని చెప్పారు. అలాంటి వ్యక్తికి శత్రువులు ఎవ్వరూ ఉండరన్నారు. నా కొత్త చిత్రంలో ఆయన చివరిసారిగా నటించారు ఐదు రోజుల క్రితమే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. అదే ఆయన చివరి చిత్రం అని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments