Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌‌లో మా మధ్య ప్రేమ చిగురించింది.. గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్: చైతూ

'ఏం మాయ చేశావో' సినిమా షూటింగ్ సందర్భంగా న్యూయార్క్‌లో తమ మధ్య ప్రేమ చిగురించిందని.. పెళ్లైన తర్వాత న్యూయార్క్ వెళ్లి ఆ సినిమాను చిత్రీకరించిన ప్రదేశాల్ని మరోసారి చూడాలనుకుంటున్నామని తెలిపారు. ఆ సినిమ

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (12:21 IST)
'ఏం మాయ చేశావో' సినిమా షూటింగ్ సందర్భంగా న్యూయార్క్‌లో తమ మధ్య ప్రేమ చిగురించిందని.. పెళ్లైన తర్వాత న్యూయార్క్ వెళ్లి ఆ సినిమాను చిత్రీకరించిన ప్రదేశాల్ని మరోసారి చూడాలనుకుంటున్నామని తెలిపారు. ఆ సినిమా ద్వారా మమ్మల్ని కలిపినందుకు గౌతమ్ మీనన్‌కు కృతజ్ఞతలు చెప్పాలని వెల్లడించారు. అక్టోబర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం సమంత తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. 
 
హైదరాబాద్‌లో పెళ్లి ఉంటుందని.. ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ దశలో అది పూర్తయిన తర్వాతే పెళ్లి పనులు మొదలపెడతానని చైతూ తెలిపాడు. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో తన ఆలోచన విధానం మారదు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణం. సమంత ఒప్పుకుంటుందా అంటే అవన్నీ సినిమాల్లో సాధారణమే. ప్రేమకథలున్నా అందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండకూడదని తాను కోరుకుంటానని చెప్పారు. 
 
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చూసిన సమంత తన కంటే ఎక్కువ సంతోషపడిందని.. తను సాధారణ ప్రేక్షకురాలిగా ఈ సినిమా ఎంజాయ్ చేసింది. బ్రేకప్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని థియేటర్ నుండే తనకు మెసేజ్ పెట్టిందని వెల్లడించారు. తన జీవితంలో కూడా చాలా బ్రేకప్‌లు ఉన్నాయి. అమ్మాయిల వెంట తిరిగినా మన లవ్ ప్రపొజల్‌ను తిరస్కరిస్తే ఎవరైనా బాధపడుతారు. అలాంటి సంఘటనలు తన లైఫ్‌లో ఉన్నాయని నాగచైతన్య తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments