నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

డీవీ
మంగళవారం, 2 జులై 2024 (12:44 IST)
Nandamuri Mokshajna
నందమూరి బాలక్రిష్ణ వారసుడు నందమూరి మోక్షజ్న సినిమా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొనేది. బాలక్రిష్ణ కూడా పలు సందర్భాల్లో నటన ఇష్టంలేదని అంటున్నాడని చెప్పాడు. కొంతకాలానికి చదువు అయ్యాక చూద్దాం అన్నారు. ఇక నేటితో ఆ మాటలకు ఫుల్ స్టాప్ పడింది. ఎక్స్ (ట్విట్టర్)లో నందమూరి బాలక్రిష్ణ నే వారసుడు వస్తున్నాడు..అంటూ పోస్ట్ చేశాడు. కొద్ది సేపటికే నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్ చేస్తూ ఓ ఫొటోను కూడా పెట్టాడు.
 
గతంలో ఓ సారి ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్న ఎంట్రీ వుంటే బాగుంటుందని తన మనసులోని మాటలను బాలక్రిష్ణ వ్యక్తం చేశాడు. అయితే ఆ కథను సింగీతం శ్రీనివాస్ రాసుకోవడానికి సమయం పడుతుందని చెప్పాడని కూడా వార్త వచ్చింది. 
 
చాలా కాలంగా మోక్ఝజ్న ఎంట్రీ కోసం కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం కుటుంబసభ్యులతోనూ సన్నిహితులతో పలు రకాల చర్చలు కూడా బాలక్రిష్ణ జరిపాడని తెలిసింది. ఎన్.టి.ఆర్. కు పరమ భక్తుడు అయిన వై.వి.ఎస్. చౌదరి కూడా తన చేతులమీదుగా ఎంట్రీ ఇప్పించాలని అనుకున్నా కుదరలేదని తెలిసింది. దాంతో కళ్యాణ్ రామ్ అన్న కొడుకు రామారావును నటుడిగా పరిచయం చేస్తున్నాడు. మరి మోక్ఝజ్న ఎంట్రీ ఏ సినిమాకో త్వరలో తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments