Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్- మహేష్ బాబు కొట్టుకుంటే.. ప్రభాస్ పట్టుకున్నాడు..ఎలాగంటే?

ఇదేంటి? నిజంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కొట్టుకున్నారా? అని అడుగుతున్నారు కదూ.. ఈ టైటిల్ పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. 2012, 2013 సంవత్సరాలకుగాను

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (15:33 IST)
ఇదేంటి? నిజంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కొట్టుకున్నారా? అని అడుగుతున్నారు కదూ.. ఈ టైటిల్ పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. 2012, 2013 సంవత్సరాలకుగాను నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో భాగంగా 2012 నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఈగ ఎంపికైంది. అలాగే 2013 సంవత్సరానికి గాను మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు అవార్డుల పంట పండింది. ఇందులో భాగంగా ఉత్తమ చిత్రంగా మిర్చి, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అవార్డులను సొంతం చేసుకున్నాయి. 
 
అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా పవర్ స్టార్ పవన్ అత్తారింటికి దారేది సినిమా నిలిచింది. ఇక ఉత్తమ హీరో అవార్డు మాత్రం ప్రభాస్‌ను వరించింది. మిర్చి సినిమాకుగాను ఈ అవార్డు బాహుబలి ప్రభాస్‌కు లభించింది. కానీ ఉత్తమ హీరో అవార్డు ప్రభాస్ మాత్రమే దక్కడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఈ అవార్డు కోసం మహేష్ బాబు- పవన్ కల్యాణ్‌ల పేర్ల ఎంపిక కోసం పెద్ద వారే జరిగిందని తెలుస్తోంది.
 
అత్తారింటికి దారేది సినిమా కోసం పవన్ కల్యాణ్‌కు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం మహేష్ బాబు ఇద్దరిలో ఒకరికి ఈ అవార్డును ఇచ్చేందుకు జ్యూరీ సభ్యులు ముందుగా అనుకున్నారట. అయితే పవన్‌కు ఈ అవార్డు ఇస్తే.. ఆయన టీడీపీకి మిత్రుడని, మహేష్‌కు ఇస్తే.. ఆయన బావ టీడీపీలో ఉన్నారని.. అందుకే ఈ అవార్డును ఇచ్చినట్లున్నారని అందరూ మాట్లాడుకుంటారు. అందుకే వారిద్దరినీ పక్కనబెట్టి మిర్చి సినిమాలో నటించిన ప్రభాస్‌కు ఈ అవార్డును సొంత చేయనున్నారు. 
 
కానీ నెటిజన్లు మాత్రం మహేష్-పవన్‌లు కుటుంబ కథా చిత్రంలో నటించి మెప్పించారని.. ఫ్యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కిన మిర్చి హీరోకు ఈ అవార్డు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ జ్యూరీ సభ్యులు మాత్రం టీడీపీ సీనియర్ నేత ఇచ్చిన సలహా మేరకు పవన్-మహేష్‌ను పక్కనబెట్టి.. ప్రభాస్‌ను ఎంపిక చేశారని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments