Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌ ఆ టైపే అనుకుంటా - తమ్మారెడ్డి మండిపాటు

నంది అవార్డుల వ్యవహారం కాస్త మెల్లమెల్లగా సద్దుమణుగుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మొదట్లో నిర్మాత బన్నీ వాసు నంది అవార్డుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురాగా ఆ తరువాత గు

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (16:48 IST)
నంది అవార్డుల వ్యవహారం కాస్త మెల్లమెల్లగా సద్దుమణుగుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మొదట్లో నిర్మాత బన్నీ వాసు నంది అవార్డుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురాగా ఆ తరువాత గుణశేఖర్, రాంగోపాల్ వర్మతో పాటు మరికొంతమంది దర్శకులు తీవ్రస్థాయిలో స్పందించారు. అవార్డుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు నాయుడు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసి చివరకు అది కాస్త సద్దుమణుగుతున్న సమయంలో లోకేష్‌ దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేశారు.
 
నంది అవార్డుల వ్యవహారంపై ఆంధ్రలో ఆధార్ కార్డులు లేనివారు అడుగుతున్నారంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. స్థానికత, సామాజిక వర్గం లాంటి వాటిని ప్రోత్సహించే మాటలే అందులో స్పష్టంగా కనిపించాయి. దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు. 
 
మంత్రి పదవిలో ఉన్న లోకేష్‌ బాధ్యతాయుతంగా మాట్లాడాలే తప్ప తెలిసీ తెలియని స్టేట్మెంట్ ఇవ్వడం బాధాకరన్నారు. మీ పరువు కాదు పోయేది మీ నాన్నగారి పరువు పోతుందని ఆలోచించడంటూ సలహా ఇచ్చారు.  మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే రాష్ట్రం పరువు పోతుందన్న భావన కలుగుతోందన్నారు తమ్మారెడ్డి. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవమనీ, ఐతే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన గౌరవానికి భంగం కలిగించేవిగా వున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments