Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతినిధి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ తో నారా రోహిత్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (19:48 IST)
pratinidi 2 look
హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. దీంతో ఇది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ కానుంది.
 
పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించింది.  యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు.  “One man will stand again, against all odds,” అనేది సినిమా క్యాప్షన్.
 
ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకట్టుకుంది. నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. అతని జుట్టు నుంచి ముఖం వరకు, ప్రతిదీ వార్తాపత్రికలతో డిజైన్ చేయబడింది.  ఫస్ట్ లుక్ సూచించినట్లుగా, ప్రతినిధి 2 సోషల్ ఇష్యూస్ ని డీల్ చేయనుంది. ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.
 
కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
 
పోస్టర్‌లో చూపిన విధంగా ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments