Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెళ్లి టీజర్ ను చూపించబోతున్న నరేష్ వికె, పవిత్ర లోకేష్

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:33 IST)
Naresh VK, Pavitra Lokesh
నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
 
మేకర్స్ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ రోజు ఈ చిత్రం టీజర్ గురించి ఎక్సయిటింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. టీజర్ ఏప్రిల్ 13న విడుదల కానుంది. నరేష్, విత్ర లోకేష్ అందమైన చిరునవ్వుతో లవ్ సింబల్స్ చూపిస్తూ కనిపించారు. నరేష్ సూట్ వేసుకోగా, పవిత్ర లోకేష్ చీరలో ఆకట్టుకున్నారు.  
 
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
 
‘మళ్ళీ పెళ్లి’ ఈ వేసవిలో విడుదల కానుంది.  
 
తారాగణం: డాక్టర్ నరేష్ వికె, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments