Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరు హీరోలపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్య

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (09:51 IST)
Natti Kumar
ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ టాలీవుడ్ హీరోలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ  లో పాల్గొన్న ఆయన హీరోలు మేకప్ లు వేసుకుని షూటింగ్ లు చేయడం కాదని, విజయ్ దేవరకొండ లాగా నెల రోజులు సినిమా కి ప్రమోట్ చేయాలని అన్నారు. అంతేకాదు సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారని, అలా ఈ రోజుల్లో ఏ హీరో కూడా లేరని అన్నారు. అందరూ అలా ఆలోచిస్తే సినిమా బ్రతుకుతుంది అని చెప్పారు.
 
సినిమా ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని అన్నారు. సినిమా ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్, నిర్మాత చేతిలో ఉంటుంది.. తన పార్ట్ సినిమా ప్రమోషన్ చేయడం. అది బాగా చేశారని ఆయన అన్నారు. ఏదేమైనా లైగర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ చేసిన ఫ్యాన్ డం టూర్ ఇప్పటివరకు ఏ హీరో కూడా చేయలేదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ను డిసెంబర్ 23 విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

ఇండోర్‌లో విజృంభించిన కరోనా.. కడుపు నొప్పితో వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. వీడియో వైరల్ (video)

వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments