Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో'' నుంచి రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది..

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (10:40 IST)
''సాహో'' సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్రభాస్ నటనలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా, తాజాగా ఓ రొమాంటిక్ పోస్టర్ విడుదల అయ్యింది. 
 
ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోని పలు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమాను ఇంకా ముందే విడుదల చేయాలని భావించినప్పటికీ, గ్రాఫిక్స్ ఆలస్యమైన కారణంగా రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
 
తాజాగా విడుదలైన పోస్టర్‌లో శ్రద్ధ.. ప్రభాస్‌ను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇకపోతే.. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. 
 
భారతీయ తొలి భారీ యాక్షన్‌ చిత్రంగా దీనిని తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు రూ.150 కోట్లతో సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల 30కి వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments