Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నటి కాదంబరి జైత్వానీ కేసులో మరో ట్విస్ట్.. ఏంటది?

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (15:03 IST)
ముంబై నటి కాదంబరి జైత్వానీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె ఐఫోన్ లాక్‌ను ఓపెన్ చేసేందుకు ఆమె స్నేహితుడిపై కూడా ఫోర్జరీ కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో పాల్గొనకపోయినా రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ వాడినట్టుగా తప్పుడు కేసు బనాయించారు. ఆమె స్నేహితుడితో పాటు మరో యువతిపై (డ్యాన్సర్)పై కూడా కేసు పెట్టారు. గత వైకాపా పాలకుల మెప్పు కోసం పోలీసులు ఈ తరహా నేరానికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. 
 
ఈ యేడాది ఫిబ్రవరి పదో తేదీ నుంచి 14 వరకు కోర్టు కాదంబరీ జైత్వానీ, ఆమె తల్లిదండ్రులను పోలీసు కస్టడీకి అనుమతించింది. సందర్భంగా జైత్వానీ ఉపయోగించే ఐఫోన్లను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అప్పటికే వాటిని నాటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు తెరిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఆమెతో ఐఫోన్లను తెరిపించేందుకు పీఎస్ఆర్ ఆదేశాల మేరకు కాంతిరాణా, విశాల్ గున్నీ తీవ్రంగా ప్రయత్నించారు. ఫోన్లను తెరిచేందుకు ఆమె అంగీకరించలేదు. ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్‌ను విజయవాడ తీసుకొస్తే.. ఆమె కంగారులో ఫోన్ల లాక్ ఓపెన్ చేస్తుందని కాంతిరాణా, విశాల్ గున్నీలకు విద్యాసాగర్ సలహా ఇచ్చారు.
 
వైకాపా నేత విద్యాసాగర్ సలహా మేరకు.. కాంతిరాణా ఓ ప్రణాళికను అమల్లో పెట్టారు. ఇందులోభాగంగా.. ఫిబ్రవరి 10న పటమట పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులతో దాడి చేయించారు. ఇందులో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చి కేసు నమోదు చేశారు. 
 
ఏ2గా.. కాదంబరీ జైత్వానికి సన్నిహితుడైన అమితకుమార్ సింగ్‌ను చేర్చారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదుచేశారు. ఈ తప్పుడు కేసును అడ్డుపెట్టుకుని అమిత్‌ను అరెస్టు చేసేందుకు ఆఘమేఘాలపై నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సీపీ కార్యాలయం నుంచే టికెట్లను బుక్ చేశారు. ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదు. చివరకు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఈలోగా కాదంబరీ జైత్వానీ, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments