Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణుడి గెటప్‌లో బాలకృష్ణ.. 21న ఆడియో రిలీజ్ వేడుక

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (09:57 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరెకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. "కథానాయకుడు', 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ఈ చిత్రంరానుంది. తొలిభాగం జనవరి 9వ తేదీన విడుదలకానుంది. 
 
అయితే, ఈ చిత్రంలోని వివిధ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ధరించిన రావణుడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య రావణుడిగా అచ్చుగుద్దినట్టు సరిపోయారు. ఈ ఫోటో వెనుకభాగంలో ఈ చిత్రంలో నటించే నటీనటులంతా ఉండటం గమనార్హం.
 
ఇకపోతే, ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా, వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో 21వ తేదీ శుక్రవారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు అతిరథ మహారథుల సమక్షంలో ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయనున్నారు. కాగా, ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలి భాగం 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన, రెండో భాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments