Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ బయోపిక్‌' ఓవర్సీస్ రైట్స్ కోసం పోటాపోటీ

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. హీరో బాలకృష్ణ ఈ చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్రి

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (12:21 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. హీరో బాలకృష్ణ ఈ చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.
 
అయితే, ఈ చిత్రంలో ప్రేక్షకుల్లోనే కాకుండా, అటు సినీ ఇండస్ట్రీలోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం అనేక అగ్రనటీనటులతో హీరోహీరోయిన్లు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా, తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో సహా ఆనాటి నటీనటుల రూపాలను వెండితెరపై చూడాలని కుతూహలంగా ఉన్నారు. అయితే ఈ బయోపిక్ విషయంలో రోజుకో సర్‌ప్రైజ్ బయటకు వదులుతూ ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది చిత్ర యూనిట్. 
 
ఈనేపథ్యంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రైట్స్ దక్కించుకోవడానికి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయట. ఈ రైట్స్ విషయంలో ఇప్పటికే ఓ సంస్థ 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని సమాచారం. అయితే సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా హక్కులను ఇంకా ఎక్కువ ధరకు అమ్మాలనే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 12 కోట్ల వరకు ఓవర్‌సీస్ హక్కుల ద్వారా రావాలని భావిస్తున్నారట. హక్కుల విషయంలోనే ఈ రేంజ్‌లో ఉందంటే.. ఇక సినిమా విడుదలైతే ఇంకెన్ని కలెక్షన్ల సునామీలు సృష్టిస్తుందోనన్న చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments