Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విజ్ షోకు డేట్స్ ఇచ్చిన ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (16:25 IST)
Ntr show
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం తుది దశ షూటింగ్ లో ఉంది. ఇక ఇంకోవైపు ఎన్‌.టి.ఆర్‌. టీవీ కోసం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ క్విజ్ షోకు డేట్స్ ఇచ్చాడ‌ట‌. ఇటీవ‌లే దీనికి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఆ త‌ర్వాత క‌రోనావ‌ల్ల అస‌లు షూటింగ్ వుంటుందా? లేదా? అనే సందేహం కూడా వ‌చ్చింది. ఇప్పుడు ప‌రిస్థితులు అనుకూలంగా వున్నాయ‌ని అందుకే ప్రారంభించార‌ట‌.
 
ఇంత‌కుముందు క‌రోనా వ‌ల్ల ఈ షో షూటింగ్ ఆగిపోయింది. అందుకే ఇప్పుడు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తిగా నిర్వ‌హించి సెట్‌లోకి అనుమతిస్తున్నారు. ముందుగా సాంకేతిక సిబ్బందికి ప్ర‌త్యేకంగా జెమిటీ టీవీ యాజ‌మాన్యం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. క‌రోనా టీకాలు వేసుకున్న వారికే అనుమ‌తి ఇస్తుంది. క్విజ్ షోకు సంబంధించిన ఎపిసోడ్ల చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఈ షో కోసం పదిరోజుల పాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి స‌రికొత్త‌గా షో వుండేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో టీవీ యాజ‌మాన్యం ప్ర‌క‌టించ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments