Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ అజ్ఞాతవాసి స్టిల్స్ అదుర్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఇ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (09:15 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన స్టిల్స్‌ను ఆ చిత్రం బృందం సినీ యూనిట్ వెల్లడించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కీర్తి సురేష్‌తో సాగ‌ర తీరాన‌, మ‌రో హీరోయిన్‌తో రెస్టారెంట్లో కూర్చుని వుండే పవన్ స్టిల్స్ అదిరిపోతున్నాయి. హైద‌రాబాద్‌లోని హెటెక్స్‌లో ఈ ఆడియో వేదిక‌ మంగళవారం జరుగనుంది. ఇప్ప‌టికే అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన రెండు పాటలు సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్న తరుణంలో మంగళవారం విడుదలయ్యే ఆడియోకు భారీ రెస్పాన్స్ వచ్చే ఛాన్సుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
ఇకపోతే.. వీడి చ‌ర్య‌లు ఊహాతీతం అంటూ డిసెంబ‌ర్ 16 విడుద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 25వ చిత్రం అజ్ఞాత‌వాసి టీజ‌ర్‌ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆడియో 19న (నేడు) విడుదల కానుండగా.. ఈ నెల 29న సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంద‌ని తెలిసింది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments