Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ సమక్షంలో కుమార్తె ఆద్య బర్త్‌డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. అందుకే, శుక్రవారం తన సినిమా 'కాటమరాయుడు' రిలీజ్ అవ

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (15:53 IST)
ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. అందుకే, శుక్రవారం తన సినిమా 'కాటమరాయుడు' రిలీజ్ అవుతున్నా... తన కుమార్తె ఆద్య పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఆమెతో గడిపి వచ్చారు. 
 
కుమార్తె ఆద్య పుట్టిన రోజు వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 2010 మార్చి 23వ తేదీన పుట్టిన ఆద్య.. గురువారంతో ఆరేళ్లు పూర్తి చేసుకుని ఏడో యేటలోకి అడుగుపెట్టింది. ఈ పుట్టిన రోజు వేడుకలు గురువారం పూణెలోని ఆద్య చదువుతున్న పాఠశాలలో జరిగింది. ఈ వేడుకలకు పవన్ హాజరుకాగా, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా హాజరయ్యారు.
 
వీరిద్దరు సమక్షంలోనే ఆద్య బర్త్‌డే కేక్‌ను కట్ చేసింది. ఆ తర్వాత కేక్ ముక్కను ఆద్యకు పవన్ తినిపించారు. అంతేకాదండోయ్.. ఆ పాఠశాలలోని ఆద్య స్నేహితులతో కూడా పవన్ నవ్వుతూ గడిపాడు. ఈ విషయాన్ని పవన్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. "పిల్లల పుట్టన రోజున కాస్త సమయాన్ని కేటాయించడమే... పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే నిజమైన బహుమతి" అని ట్వీట్ చేసింది.
 
కాగా, 2011లో విడాకులు తీసుకున్న పవన్ - రేణూ దేశాయ్‌లో భార్యాభర్తల కంటే.. మంచి స్నేహితులుగా ఉంటున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు కుమారుడు అఖిర కాగా, కుమార్తె ఆద్య. పవన్ నుంచి వేరైన తర్వాత రేణూ దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో నివశిస్తూ.. మరాఠీ చిత్రాల ప్రొడక్షన్‌లో బిజీగా గడుపుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments