పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దైవభక్తి గురించి చెప్పక్కరలేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించాక ప్రతి కదలికను దైవునిపై వేస్తుండడం తెలిసిందే. ఆయన పరమ భక్తుడు. ఇప్పటికే పలు యాగాలు, హోమాలు నిర్వహించారు. ఇటీవలే తన కుమారుడు విదేశాల్లో ప్రమాదానికి గురయినప్పుడు అంబాయాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాజాగా అది కార్యరూపం దాల్చబోతోంది.
Pitapuram yagam hording
ప్రణవపీఠాధిపతి, ప్రవచన నిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే మే 18(ఆదివారం) ,2025 "పీఠికాపుర క్షేత్ర వైశిష్ట్యం" పై ప్రవచనం (పిఠాపురం, అంబాయాగం, చండీ పారాయణము, 108 సార్లు మణిద్వీప వర్ణన(మూడు రోజులపాటు) పారాయణము(దేవీ భాగవతం లోని 273 సంస్కృత శ్లోకాలు) జరుగుతుంది.
లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం ఈ యాగం పిఠాపుర నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం లో ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ గారి స్వగృహము లో జరుగుతుంది. పూజ్య గురుదేవులు స్వయంగా మే 18 న అంబాయాగం , చండీ హోమం మరియు మణిద్వీప పారాయణము లో పాల్గొంటారు. సాయంత్రం పిఠాపుర క్షేత్ర మాహాత్మ్యం పై ప్రవచనం చేస్తారని పిఠాపురంలో హోర్డింగ్ లు కూడా కట్టారు. అబిమానులు ఉత్సాహంగా పాల్గొనున్నట్లు తెలిసింది.