Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి ఆలయ ఆర్ట్ డైరక్టర్ ఆనంద సాయిని సత్కరించిన పవన్ కల్యాణ్..

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (12:07 IST)
Pawan kalyan
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు, చాలా సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద సాయిని తాజాగా అభినందించి తన కార్యాలయంలో సన్మానించారు. ఆనంద్ సాయి తండ్రి కూడా సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కావడంతో ముందు నుంచి సినీ పరిశ్రమలో తన తండ్రికి సహాయకుడిగా పని చేస్తూ తర్వాత తాను సొంతంగా ఆర్ట్ డైరెక్టర్‌గా మారి పలు సినిమాలకి వర్క్ చేసారు. 
 
ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్‌తో తొలిసారిగా తొలిప్రేమ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అందులో ఒక పాటలో తాజ్ మహల్ సెట్ వేశారు సాయి. ఆ సెట్‌కి చాలామంచి పేరు రావడంతో పాటు, తొలిప్రేమ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆనంద్ సాయి పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా మారారు.
 
ఈ సినిమాతో పవన్, ఆనంద్ మంచి మిత్రులుగా మారారు. అప్పటినుంచి వీరి స్నేహం అలా కొనసాగుతుంది. ఆ తర్వాత చాలా మంది పెద్ద హీరోల సినిమాలకి, పవన్ కళ్యాణ్‌తో కూడా ఇంకో మూడు సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి పని చేశారు. తర్వాత సినిమా ఆర్ట్ డైరెక్టర్‌గా దూరమై ఘనంగా నిర్వహించే పెళ్ళిళ్ళకి, సినీ పరిశ్రమలో చాలా మంది పెళ్ళిళ్ళకి సెట్ డిజైన్ చేసి ఈవెంట్స్ ఆర్ట్ డైరెక్టర్‌గా మారారు.
 
ఆ తర్వాత ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసి 2016 నుంచి తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పూర్తి స్థాయిలో పని చేశారు. యాదాద్రి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించినందుకు గాను ఇటీవల ప్రభుత్వం నుంచి ఆనంద్ సాయికి "ధార్మిక రత్న" పురస్కారం లభించింది. 
 
ఆనంద్ సాయి 'ధార్మిక రత్న' పురస్కారం అందుకోవడంతో ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తన మిత్రుడైన ఆనంద్ సాయిని తన కార్యాలయంలోనే అభినందించి శాలువాతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడైన నటుడు నర్రా శ్రీను సైతం ఈ సత్కారంలో పాల్గొని ఆనంద్ సాయికి అభినందనలు తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments