Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ (video)

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (17:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత తన 26వ చిత్రం వకీల్ సాబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని షూటింగ్ జరుగుతుండగానే తదుపరి చిత్రం క్రిష్‌తో ఉండబోతోంది. క్రిష్ దానికి సంబంధించిన స్క్రిప్ట్, సెట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు. వకీల్ సాబ్ సినిమాని డైరెక్టర్ వేణు శ్రీరామ్ హిందీ పింక్ నుండి రీమేక్ చేస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ఇది.
 
పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా 'విరూపాక్ష'ను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏయం రత్నం నిర్మిస్తుండగా, సినిమా కథ మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది. సినిమా అంతా కోహినూర్ వజ్రానికి సంబంధించిన కథ చుట్టూ నడుస్తుందని ఇదివరకే తెలిపారు.
 
పీరియాడిక్ సినిమా కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఏర్పాటు చేసి ఆ కాలం నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. పవన్‌కి మొదటి హిస్టారికల్ సినిమా అయిన దీని షూటింగ్ విషయానికి వస్తే జులై సెకండ్ వీక్ నుండి ప్రారంభం కానుందని వార్తలు వినిపించాయి. కానీ షూటింగ్ ఆగష్టు నెల సెకండ్ వీక్ నుండి ప్రారంభం అవుతుందని తాజా సమాచారం. ఈ ఏడాది ముగిసే లోపు షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments