Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్ర‌ల‌హ‌రి చిత్ర యూనిట్‌ని అభినందించిన ప‌వ‌న్ కళ్యాణ్‌

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:56 IST)
మెగాహీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ గత కొంత కాలంగా సరైన హిట్‌లు లేక డీలా పడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న తేజ్‌కి చిత్రలహరి చిత్రం కాస్త ఊరటనిచ్చింది. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రాల దర్శకుడుగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్ అనే పాత్రలో సాయిధరమ్ తేజ్ మంచి నటనను కనబరిచాడు. 
 
గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో పూర్తిభిన్నంగా సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌ను కనబరిచాడు. సంఘర్షణతో కూడుకున్న స్ఫూర్తివంతమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మరోవైపు కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. పోసాని, రావురమేష్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు తమదైన శైలిలో మెప్పించారు. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన సంగీతం బాగుంది.
 
మొత్తానికి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని చూసిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని తాను చాలా ఎంజాయ్ చేసానని పవన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments