Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయానక హార్రర్ పిండం తొలి ప్రచార చిత్రం విడుదల

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:10 IST)
Pindamfirstlook- srivishnu
ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న ‘పిండం‘ చిత్రాన్ని తొలిసారి దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్న  సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు.  కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈరోజు చిత్రానికి సంభందించిన టైటిల్ ఫస్ట్లుక్ పోస్టర్‌ని హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించి విజయాన్ని ఆశిస్తూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు  తెలిపారు.

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతోందని చిత్ర దర్శకుడు సాయికిరణ్ దైదా  చెబుతూ, ఇంతటి భయానక  హార్రర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని అభిప్రాయ పడ్డారు.  "ది స్కేరియస్ట్ ఫిల్మ్" అనే ది ఉప శీర్షిక. ఇది విడుదల అయిన ప్రచార చిత్రాన్ని గమనిస్తే నిజమని పిస్తుంది. దీపపు లాంతర్లు వెలుగులో చిత్ర కథానాయకుడు శ్రీరామ్, నాయిక ఖుషి రవి,ఈశ్వరీ రావు తదితరులు ఓ బల్లపై పడుకున్న పాప చుట్టూ ఉండటం, ఓ వ్యక్తి చేతిలో పుస్తకం, వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా ఏదో ప్రమాదం గురించి కనిపిస్తున్న ఆందోళన, ఇవన్నీ భయానికి గురి చేస్తున్నాయి.  ఇది జానర్‌కు అనుగుణంగా స్ట్రెయిట్ హార్రర్ ఫిల్మ్ అవుతుంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో...మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనుంది అన్నారు. హార్రర్ కథావస్తువు దర్శకుడిగా నా తొలి చిత్రానికి ఎంచుకోవటం వెనుక కారణం ఛాలెంజింగ్ గా ఉంటుందని.

పిండం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 30న విడుదల చేయనున్నారు. నవంబర్ నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments