Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా నరసింహారెడ్డిలో పవన్ కల్యాణ్..

మెగాస్టార్ చిరంజీవి నటించే సైరా సినిమాలో పవర్ స్టార్ పవన్ కనిపించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో చిరూ సినిమాల్లో పవన్ మెరిసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (09:27 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే సైరా సినిమాలో పవర్ స్టార్ పవన్ కనిపించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో చిరూ సినిమాల్లో పవన్ మెరిసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ 151వ సినిమా సైరా నరసింహా రెడ్డిలో పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది. 'శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్‌లోను అన్నయ్యతో కలిసి పవన్ కల్యాణ్ సందడి చేశాడు. 
 
తాజాగా సైరాలోనూ అన్నయ్యతో కలిసి పవన్ తెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, స్టార్ హీరోతోనే ఆ పాత్ర చేయించాలని ఈ సినిమా టీమ్ భావించిందట. ఈ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఈ పాత్ర కోసం పవన్ కల్యాణ్‌ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
 
అలాగే తాజాగా సైరాలో మరో కీలక పాత్ర కోసం భోజ్‌పురి నటుడు రేసుగుర్రం విలన్ రవికిషన్‌ను ఎంపిక చేసుకున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే దిశగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డిసెంబర్ ఆరోతేదీన ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపున ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక కొనసాగుతూనే వుంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రల కోసం అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతిని తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments