Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్‌'గా యంగ్ రెబెల్ స్టార్ : బడ్జెట్ రూ.350 కోట్లు?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (08:24 IST)
'బాహుబలి' చిత్రం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క చిత్రంతో ప్రభాస్ ఖండాంతరాలు దాటి ఇంటర్నేషనల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా అతనితో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ చిత్రాలను నిర్మించేందుకు అనేక మంది బడా నిర్మాతలు, నిర్మాణ కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్ప‌టికే రాధే శ్యామ్ అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్ .. మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ మూవీ చేయ‌నున్నాడు. ఇందులో దీపిక ప‌దుకొణె క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  
 
ఇకపోతే, గ‌త రాత్రి ప్ర‌భాస్ త‌న ఫ్యాన్స్‌కి మేజ‌ర్ అప్‌డేట్ ఇస్తా అని చెప్పారు. అన్న‌ట్టుగానే సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు మ‌రో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'తనాజీ' చిత్ర దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే భారీ ప్రాజెక్టును చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేయ‌గా, ఇందులో 'ఏ' అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో డిజైన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఉంచారు.
 
ఈ చిత్రం టైటిల్ చూస్తుంటే, ఇది కూడా హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో మ‌రో పాన్ ఇండియా సినిమా అని ఇట్టే తెలుస్తోంది. భారీ 3డీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించనున్నారు. టీ-సీరిస్‌ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని సుమారుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments