Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరవ్ మోదీతో డీల్ వదిలించుకోవడం ఎలా..? ప్రియాంక చోప్రా మల్లగుల్లాలు

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కొత్త చిక్కొచ్చి పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. ముంబైలోని సదరు బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధిక

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:30 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కొత్త చిక్కొచ్చి పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. ముంబైలోని సదరు బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిగినట్లు పీఎన్‌బీ గుర్తించింది. 
 
ఇంకా బ్యాంకులకు రూ.11 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి.. జనవరి 1న దేశాన్ని విడిచి పారిపోయిన నీరవ్ మోదీతో బ్రాండ్ అంబాసిడర్ డీల్ కుదుర్చుకున్న బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా.. ఆ ఒప్పందాన్ని ఎలా రద్దు చేసుకోవాలనే అంశంపై లాయర్ల సలహా తీసుకుంటోంది. 
 
ఈ క్రమంలో గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఆమె ఎలా వదిలించుకోవాలనే దిశగా ప్రియాంక చోప్రా ప్రయత్నిస్తున్నారు. జనవరి 2017 నుంచి నీరవ్ మార్కెటింగ్ చేస్తున్న వివిధ రకాల ఆభరణాలకు ప్రియాంక చోప్రా ప్రచారం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. భారత్‌లో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు మరెన్నో బ్యాంకులను రూ.11 వేల కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో వున్నట్లు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ నిందితుడన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments