Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం క్యాప్చర్

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (10:45 IST)
Priyanka Upendra
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంత వరకు సినీ ప్రపంచంలో రానటువంటి ఈ ప్రయోగాత్మక చిత్రమిది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు.

ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్‌ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.
 
శివ రాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments