Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ట్ ఫిలిం నచ్చి పూరి జగన్నాధ్ ఆఫర్ ఇచ్చారు : ప్రేమదేశం చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్ధం

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (16:20 IST)
Srikanth Sidham
హైదరాబాద్ లో బి.టెక్ చదువుకొని అమెరికా వెళ్లి సాఫ్ట్ వెర్ లో జాబ్ చేస్తున్న నాకు సినిమా తియ్యాలనే ప్యాషన్ ఉండడంతో ఇండియాకు రావడం జరిగింది. డైరెక్షన్ పరంగా నేను ఎవరి దగ్గర పని చేయలేదు. షార్ట్ ఫిలిం తీసిన నేను నెక్స్ట్ స్టెప్ లో మంచి లవ్ సబ్జెక్టు ఉన్న ఫ్యూచర్ ఫిలిం తీస్తే బాగుంటుందని, ఈ సినిమాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా షార్ట్ ఫిలిం నచ్చి పూరి జగన్నాధ్ ఆఫర్ ఇచ్చారు. కానీ సాంకేతిక కారణాలతో వర్కౌట్ కాలేదు. నేనే నిర్మాతగా  ప్రేమదేశం చేసాను అని చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్ధం అన్నారు. 
 
1996లో విడుదలై పెద్ద సూపర్ హిట్ సాధించిన” ప్రేమదేశం” సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. చాలా కాలం తర్వాత అదే టైటిల్ తో వస్తున్న  సినిమా “ప్రేమదేశం’. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. సిరి క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై త్రిగున్ , మేఘా ఆకాష్  హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలకు కూడా మంచి మార్కులు పడ్డాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 
 
శ్రీకాంత్ సిద్ధం మీడియాతో మాట్లాడుతూ... . రెండు విభిన్నమైన ప్రేమ కథలను తీసుకొని చేసిన సినిమానే "ప్రేమదేశం".మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాలో మంచి మోడరన్ గెటప్ ఉన్న తల్లి పాత్రకు ఇదివరకే చేసిన వారితో చేస్తే రొటీన్ గా ఉంటుందని అలాగే ప్రేక్షకులకు కొంత ఫ్రెస్ నెస్ తో పాటు ఆ క్యారెక్టర్ లో కొంత బబ్లీ నెస్ ఉంటుందని భావించి మధుబాల గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారితో పాటు విలక్షణ నటుడైన తనికెళ్ల భరణి  ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తల్లీ,కొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించడం జరిగింది. త్రిగున్ , మేఘా ఆకాష్ పెయిర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  యూత్ బేస్డ్ గా చూస్తే సాంగ్స్ పరంగా, సీన్స్ పరంగా, కాలేజీ బ్యాక్ డ్రాప్ పరంగా చాలా కేర్ తీసుకొని చేయడంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. 
 
మేము విడుదల చేసిన “ప్రేమదేశం” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట, తెలవారెనే స్వామి ఇలా ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి .అయితే నాడు బ్లాక్ బస్టర్ అయిన "ప్రేమదేశం" టైటిల్ పెట్టాం కదా అని ఆ టైటిల్ ను వాడుకొని సినిమా తీయకుండా నేటి యూత్ కు తగ్గట్టు కథను మార్చుకొని తియ్యడం జరిగింది.ఈ సినిమా కథ విషయంలో విజువల్ గా నా మైండ్ లో బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ అయిన అందువల్ల అదే వేలో వెళ్ళాను. డైరెక్టర్ గా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు కానీ ఓన్ గా ప్రొడక్షన్ చేయడం, అలాగే కొంత మంది ఫ్రెండ్స్ తో కలసి ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా బాగా రావాలనే క్రమంలో కొంత బడ్జెట్ పెరిగింది. దాంతో ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బంది ఎదురైనా కూడా ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాము. మాకు కథ మీద ఉన్న నమ్మకం, అలాగే మణి శర్మ గారిమీద ఉన్న విశ్వాసం. ఈ రెండు ఉండడం వలన ప్రేక్షకులను కచ్చితంగా థియేటర్స్ రప్పిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments