Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'పుష్ప'రాజ్.. రూ.71 కోట్ల ఓపెనింగ్స్‌తో దూకుడు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (18:04 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ కె.సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". ఈ నెల 17వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ చిత్రం ఓపెనింగ్ రోజున ఏకంగా 71 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టింది. 2021 సంవత్సరంలో రిలీజైన భారతీయ చలన చిత్రాలు రాబట్టిన హయ్యస్ట్ గ్రాసర్ ఇదేనని ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ తెలిపింది. 
 
ఇకపోతే, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. పాత రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా, పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నటనకు మరో స్థాయిలో ఉందని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. నటన పరంగా బన్నీ మరో మెట్టుకు ఎదిగారంటూ రివ్యూల్లో సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ కాగా,  పాహద్ ఫాజిల్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటించారు. సంగీత బాణీలను దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చారు. హీరోయిన్ సమంత ప్రత్యేక ఐటమ్ గీతంలో నర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

తర్వాతి కథనం
Show comments