Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రాధే శ్యామ్’ నుంచి సోచ్ లియా సాంగ్‌కు అనూహ్యమైన స్పందన..

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:22 IST)
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా? పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సోచ్ లియా సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది. 

 
ఆషికి 2, కబీర్ సింగ్ సినిమాకు మ్యాజిక్ చేసిన మిథున్, అర్జీత్ సింగ్ కాంబినేషన్‌లో ఈ పాట వచ్చింది. ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. మొన్న విడుదలైన ఆషికి ఆగయీ ఎలా అయితే ఇన్స్టెంట్ హిట్ అయిందో ఇప్పుడు ఈ పాట కూడా అలాగే అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు.
 
 
హిందీ వెర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.
 
కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

 
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు.. టెక్నికల్ టీమ్: 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్; నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌, బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్; సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్, సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి, ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్, పిఆర్ఓ : ఏలూరు శ్రీను

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

భారత్ దెబ్బకు వణికిపోతున్న పాకిస్థాన్ - రక్షణ వ్యయం 18 శాతానికి పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments