Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్.. రాధేశ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. కెమిస్ట్రీ పేలిపోయింది..

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (09:42 IST)
బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం రాధేశ్యామ్. 'సాహో' విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు ప్రాంతాల్లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 7010 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. 
 
ఈ సందర్భంగా పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందో అనే దానిపై ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  ఈ సినిమా ఫస్టాఫ్ బాగుందని... ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ట్విట్టర్ రివ్యూ వస్తోంది. ఇంకా రాధే శ్యామ్‌లోని 3 పాటలు చూసేందుకు బాగున్నాయని టాక్ వచ్చేసింది. ఇంటర్వెల్ పాయింట్ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని రివ్యూ వచ్చింది. 
 
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. 
 
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినా.. నార్త్ రీజియన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments