Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెర వెనుక చాలానే జరుగుతాయ్.. అవన్నీ బయటకురావు (video)

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (11:55 IST)
తెర వెనుక చాలా జరుగుతుంటాయనీ, అవన్నీ బయటకు రావని హీరో బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే అన్నారు. చిత్రసీమలో జరుగుతున్న లైంగిక వేధింపులు మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై రాధికా ఆప్టే స్పందించారు. 
 
మీటూ ఉద్యమం తర్వాత చాలా మార్పు వస్తుందని తాను భావించానని, కానీ, ఎలాంటి మార్పులు రాలేదన్నారు. నిజానికి తెరవెనుక చాలా జరుగుతుంటాయనీ, అవన్నీ బయటకురావని చెప్పుకొచ్చరాు. ఇది ఎంతో నిరాశపరచే అంశమన్నారు. 
 
అదేవిధంగా సినీ ఇండ్రస్ట్రీలో పురుషులకు, స్త్రీలకు చెల్లించే పారితోషికాల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. సమానత్వం అనేది ఇంకా రాలేదన్నారు. 'ఏ' సర్టిఫికెట్ సినిమాలలో నటించే నటీమణులకు... అదే తరహా సినిమాలలో నటించే హీరోలతో సమానమైన పారితోషికం ఇవ్వాల్సివుందన్నారు. 
 
'ఏ' సర్టిఫికెట్ సినిమాలో నటించే హీరోలు కోట్ల రూపాయల లబ్ధిపొందుతారని అన్నారు. వారికి అధిక పారితోషికం ఇవ్వాల్సిందే... అయితే వారితో పాటు మిగిలిన నటులు కూడా కష్టపడ్డారనేది గుర్తించాలన్నారు. కాగా, ఈమె బాలయ్య సరసన లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం