Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సంఘి' అనేది తప్పు పదం కాదు... కుమార్తెకు అండగా... ప్రమోషన్ కోసం కాదు : రజినీకాంత్

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (08:53 IST)
తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ సంఘి పదాన్ని తప్పుగా అభివర్ణించలేదని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. తన తండ్రి అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తి అని మాత్రమే చెప్పిందని ఆయన సమర్థించారు. ఇటీవల చెన్నైలో జరిగిన "లాల్ సలామ్" సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ సంఘి అనే పదాన్ని వాడారు. ఇది పెను చర్చకు దారితీసింది. సినిమా ప్రమోషన్ కోసమే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై రజినీకాంత్ స్పందించారు. 
 
"నాన్న అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తి అని చెప్పారు. అందుకే తండ్రిని అలా అభివ్ణించింది" అని రజినీ చెప్పారు. లాల్ సలామ్ సినిమా ప్రమోషన్ కోసమే ఆమె అలా మాట్లాడారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. 
 
కాగా, రైట్ వింగ్ మద్దతుదారుడు లేదా కార్యకర్త గురించి చెప్పడానికి సంగి వ్యవహారిక పదంగా ఉంది. ఈ పదాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడారంటూ ఐశ్వర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదంపై ఐశ్వర్య మాట్లాడుతూ, పలు రిపోర్టులు వెలువడటంతో చర్చనీయాంశమయ్యాయి. కాగా, ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలామ్ మూవీ వచ్చే నెల 9వ తేదీన విడుదల కానుంది. ఇందులో రజినీకాంత్ అతిథి పాత్రను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments