మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్'లో చెర్రీ నటిస్తున్నాడు. ఇటీవల విమానాశ్రయంలో చెప్పులు లేకుండా కనిపించాడు. ఆ సమయంలో చెర్రీ దీక్షలో వున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ నల్ల కుర్తా-పైజామా, చెప్పులు లేకుండా, తలపై తిలకంతో కనిపించాడు.
Ram Charan
బుధవారం ఉదయం సిద్ధివినాయక ఆలయానికి చేరుకున్న ఆయన నల్ల కుర్తాలో కనిపించాడు. రామ్ చరణ్ ఈ బ్లాక్ లుక్‌ని అభిమానులు ఇష్టపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Ram Charan
అయితే, ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా రామ్ చరణ్ చాలాసార్లు చెప్పులు లేకుండా కనిపించాడు. ఆస్కార్ అవార్డ్స్‌కి వెళ్లకముందు కూడా రామ్ చరణ్ చెప్పులు లేకుండానే కనిపించాడు. దీక్ష కారణంగానే చెప్పుల్ని చెర్రీ ధరించలేదని.. సిద్ధి వినాయక ఆలయంలో దీక్షను విరమించారని టాక్ వస్తోంది.