Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతగా నిజమైన మెగాస్టార్‍‌ను చూస్తున్నా : సైరా నిర్మాత

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (13:47 IST)
దేశ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు "సైరా నరసింహా రెడ్డి" జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాగా, ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు వంటి అగ్ర నటీనటులు నటిస్తున్నారు. 
 
అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పనులను నిర్మాతగా రామ్ చరణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సైరా ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో 'నరసింహా రెడ్డి' గెటప్‌లో ఉన్న చిరంజీవికి సూచనలు ఇస్తూ రామ్‌చరణ్ కనిపిస్తున్నారు. 
 
'సైరా పాత్రలో నాన్న పరకాయ ప్రవేశం చేశారు. ఆయన అభినయం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. నేను నిర్మాతగా మారిన తర్వాతే నిజమైన మెగాస్టార్‌ను చూశాననే భావన కలిగింది' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫొటో మెగాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రానికి ఏ.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, గాంధీ జయంతి సందర్భంగా అంటే అక్టోబరు రెండో తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments