Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అవతారమెత్తిన మెగా కోడలు... దేనిపై ప్రోగ్రామ్ చేస్తోందో తెలుసా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:30 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పెళ్లి సమయంలో కాస్త బొద్దుగా కనిపించడంతో అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేశారు. ఈ విమర్శలను సద్విమర్శలుగా తీసుకున్న ఉపాసన... ఫిట్నెట్‌పై దృష్టిసారించింది. ఫలితంగా ఆమె ఇపుడు చాలా స్లిమ్‌గా తయారైంది.
 
అలాగే లుక్స్ పరంగా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇక అప్పటి నుంచి అపోలో లైఫ్ ద్వారా ఫిట్నెస్, హెల్తీ ఫుడ్ విషయంలో అందరినీ చైతన్యపరిచే వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అపోలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో ఫిట్నెస్‌పై సోషల్ మీడియాలు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి యాంకర్‌గా మారి, సమంతను ఇంటర్వ్యూ చేశారు.
 
ఫిట్నెస్‌కు సంబంధించి పలువురు సెలబ్రిటీలతో వరుసగా ఇంటర్వ్యూలు చేసి, వాటిని తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మొదటి ఇంటర్వ్యూ‌ను సమంతతో నిర్వహించేసి, అందుకు సంబంధించిన టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు.

ఇంతకీ తొలి ఇంటర్వ్యూకి సమంతను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించగా ఉపాసన స్పందిస్తూ... ‘నాకు ఇలాంటి ప్రోగ్రామ్ చాలా కొత్త. సమంత నాకు చాలా సన్నిహితురాలు. ఆమె‌తో అయితే నేను రిలాక్స్‌గా చేయగలను' అని చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె సమంతను పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగినట్లు, సమాధానాలను రాబట్టినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments