Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాకంటే పిచ్చోడివి కాబట్టే నిన్ను నమ్మాను' : కీరవాణికి వర్మ రీ ట్వీట్

ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. కీరవాణి తనకంటే పిచ్చోడని వ్యాఖ్యానించారు. అందుకే క్షణక్షణం - అన్నమయ్య - బాహుబలి - గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (12:04 IST)
ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. కీరవాణి తనకంటే పిచ్చోడని వ్యాఖ్యానించారు. అందుకే క్షణక్షణం - అన్నమయ్య - బాహుబలి - గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించాడంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
తాజాగా రాంగోపాల్ వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) చిత్రానికి కీరవాణి సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రూపొందిన వీడియోకి కీర‌వాణి సంగీతం అందించ‌డ‌డం అంద‌రికి ఆశ్య‌ర్యాన్ని క‌లిగించింది. 
 
దీనిపై కీరవాణి స్పందిస్తూ, "జీఎస్టీతో న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించారు వ‌ర్మ‌. సెల్యులాయిడ్‌పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో వ‌ర్మ‌ తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు తాను సంగీతాన్ని అందించబోతున్నాను. ఇక నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి కృతజ్ఞతలు" అంటూ కీరవాణి రీసెంట్‌గా ట్వీట్‌ చేశారు. 
 
దీనిపై తాజాగా స్పందించిన వ‌ర్మ "నువ్వు నాకంటే పిచ్చోడివి కాబట్టే నేను నిన్ను నమ్మాను ఎందుకంటే నీలాంటి ఒక తెలివైన పిచ్చోడు మాత్రమే క్షణక్షణం - అన్నమయ్య - బాహుబలి - గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌కి జంప్ చేయగలడు" అని వర్మ రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం