Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నగారి టైటిల్‌ను వాడుకుందాం... "జగదేకవీరుడు"గా చెర్రీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "జగదేకవీరుడు అతిలోకసుందరి". ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. అయితే, ఇపుడు ఆయన తనయుడు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ఈ టైటిల్‌ను కాపీ కొట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తా

Webdunia
బుధవారం, 30 మే 2018 (18:21 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "జగదేకవీరుడు అతిలోకసుందరి". ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. అయితే, ఇపుడు ఆయన తనయుడు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ఈ టైటిల్‌ను కాపీ కొట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాను నటిస్తున్న తాజా చిత్రం కోసం ఈ టైటిల్‌ను వాడుకోవాలని భావిస్తున్నారు.
 
నిజానికి "రంగస్థలం" వంటి భారీ హిట్ తర్వాత చెర్రీ తన ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అదేసమయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో మల్టీస్టారర్ చేస్తూనే.. మరోవైపు బోయపాటితో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరయిన బోయపాటి శ్రీను.. రామ్ చరణ్‌ను ఎలా చూపించబోతున్నారనే దానిపై మెగాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 
 
ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం టైటిల్‌పై అపుడే వివిధ రకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి భారీ హిట్ ఇచ్చిన 'జగదేక వీరుడు.. అతిలోక సుందరి' సినిమా నుంచి, ఈ సినిమాకి టైటిల్‌ను తీసుకున్నట్లు చెబుతున్నారు. 
 
కథ మొత్తం రాయల్ ఫ్యామిలీకి సంబంధించినది కావడంతో నిర్మాతలు ఈ సినిమాకు 'రాజా మార్తాండ' అనే టైటిల్ పెట్టాలని భావించారట. కానీ, ఆ టైటిల్ కంటే... 'జగదేవక వీరుడు' అనే టైటిల్ అయితే సరిగ్గా ఉంటుందని భావించి ఆ టైటిల్‌ను ఖరారు చేయాలని భావిస్తున్నారట. 
 
ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా మెగాస్టార్ సినిమా టైటిల్‌తోనే వస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments