Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పిశాచి-2" పాటలను విడుదల చేసిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2". "డేంజర్ జోన్" అన్నది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 17న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియోను కేంద్రమం

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (15:54 IST)
స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2". "డేంజర్ జోన్" అన్నది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 17న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. భీమవరం మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. 
 
ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శివాజీ రాజా, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ శాసన సభ్యులు మల్‌రెడ్డి రంగా రెడ్డి, ప్రముఖ నటి రమ్యశ్రీ, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 
లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న "పిశాచి-2" పాటలు తన చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉందని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. "పిశాచి-2" చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందని, ఈనెల 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని సాయి వెంకట్ తెలిపారు. ఆర్.జె.రూపేష్ శెట్టి - రమ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వీనస్ మూర్తి, సంగీతం: సతీష్ ఆర్యన్, నిర్మాత: లయన్ సాయి వెంకట్, దర్శకత్వం: దేవరాజ్ కుమార్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments