Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ'... రంగస్థలం టీజర్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హీరోయిన్ సమంత పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:45 IST)
మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హీరోయిన్ సమంత పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ మొదలైంది. సమంత పాత్ర గురించి చరణ్ పాత్ర చెబుతూ ఉండగా, ఆమె విజువల్స్‌పై ఈ టీజర్ కొనసాగింది. పల్లె పడుచులా సమంత  బిందె చంకనబెట్టుకుని గోదావరి వైపు నడుస్తూ కనిపిస్తుంది.
 
ఇక... పల్లె పిల్లలా ఆమె తన పనులు చేసుకుంటూ ఉండగా, "ఓహోహో ఏం వయ్యారం.. ఏం వయ్యారం.. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలిగానండీ.. ఈ పిల్లను చూస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసు వచ్చినట్టు ఉంటదండీ. ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ. పేరు రామలక్ష్మి అండీ.." ఊరు 'రంగస్థలం' అంటూ చరణ్ వాయిస్‌పై ఈ టీజర్ పూర్తయింది. ఈ చిత్రంలో సమంత పక్కా పల్లెటూరి పిల్ల పాత్రలో ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments