Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటిపై అత్యాచారం... నిందితుడి అరెస్టు

హైదరాబాద్ నగరం, ఎల్బీ నగర్‌కు చెందిన బుల్లితెర నటిపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. టీవీ ఆర్టిస్టు రూప ఎల్బీనగర్‌లో నివసిస్తోంది. అదేప్రాంతంలో అనంతపురానికి చెందిన గిరీ

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (09:31 IST)
హైదరాబాద్ నగరం, ఎల్బీ నగర్‌కు చెందిన బుల్లితెర నటిపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. టీవీ ఆర్టిస్టు రూప ఎల్బీనగర్‌లో నివసిస్తోంది. అదేప్రాంతంలో అనంతపురానికి చెందిన గిరీశ్ కూడా ఉంటున్నాడు. గతకొంతకాలంగా రూపను వెంటాడుతున్న గిరీశ్... ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో రూపకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు రహస్యంగా తీసిన గిరీశ్, తన మాట వినకపోతే వీటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు. 
 
ఈ నేపథ్యంలో అనంతపురంలో తన ఇంటికి రూపను తీసుకువెళ్లి నిర్బంధించి, పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గిరీశ్ బారి నుంచి ఏదో విధంగా తప్పించుకుని బయటపడ్డ రూప హైదరాబాద్ చేరుకుంది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఈ రోజు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్బీనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. అనంతపురంలో గిరీశ్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments